నీ గురించి
- Balatripura Sundari Venugopal

- Jan 10, 2021
- 1 min read
ఈ పాతబడిన క్షణాల్ని,
కోయిల గొంతులోనే కలకాలం మిగిలిపోనీ.
ఎప్పుడన్నా వెనక్కి తిరిగినప్పుడు,
ఆ సంగీతాన్ని వెదుక్కుoటాను.
నీ సాయంకాలాలు నీకై భద్రంగా పొందుపరుస్తాను.
ఈ ఉదయం నీ హృదయమని మర్చిపోకు.
రాబోయే కాలమంతా రవసెల్లాలు పరచి అలంకరించాను
నీ ఏకాంతంలో పలకరించినా నేనిక్కడే ఎదురుచూస్తుంటాను
Comments