మా ఇంట్లో ఊరగాయల హడావుడి
- Balatripura Sundari Venugopal

- Sep 26, 2023
- 1 min read
మా ఇంట్లో ఊరగాయల సందడిని, ఆ సందడి మూలంగా ఎదురైన హాస్య సన్నివేశాలను తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు, నవ్వుతోపాటు మళ్ళీ అమ్మమ్మ, అమ్మ చేతి రుచులు గుర్తుకు వచ్చి ఒక కంట గోదారమ్మ, మరో కంట కృష్ణమ్మ పరుగులు తీస్తాయి. పొద్దుట పొద్దుటే మా పిల్లకోతులకి చద్దన్నాలు పెరుగుతో పాటు జాడీలు ఊడ్చేసిన పాత ఊరగాయలు కలిపి పెట్టేసి, బయటకో, ఎవరైనా స్నేహితుల ఇళ్లకో వంతులవారీగా తరిమేసి మళ్ళీ భోజనాల వేళకి పిలిచేదాకా వచ్చారో తాట వలుస్తామని హెచ్చరికలు జారీ చేసేవారు. ఇహ ఇంట్లో ఉండే పెద్ద తలకాయలు ఊరగాయ తయారీ ప్రణాళికను పకడ్బందీగా అమలుపరచడానికి కొంగులు బిగించి ముందుకు దూకేవారు. మగంగులకు ఇంతో కాఫీయో, టీయో పోసి, ఊరగాయ సరంజామా జాబితాను ఇల్లాళ్లు ఇచ్చేవారు. కోతలు, కొసరులు, రుసరుసలు, చిటపటలు సుదీర్ఘ చర్చల తరువాత శాంతియుత పరిష్కారంతో కథ ఒక కొలిక్కి వచ్చేది.
Comments