మనోగతం
- Balatripura Sundari Venugopal
- Nov 15, 2020
- 1 min read
అల్లో మల్లో
(పింగళివారికి కృతజ్ఞతలతో)
చాన్నాళ్లుగా ఒక బ్లాగుని మొదలుపెట్టి నా ఆలోచనలను మీ అందరితో పంచుకోవాలని ఒకటే తాపత్రయం. అలాగని నా గురించి పెద్దగా చెప్పుకోవడానికి విషయం ఉన్నదానిని కాను. అంతర్జాలంలో చూస్తున్న అనేక బ్లాగుల వలన ఉత్తేజితురాలిని అయ్యి, నేనూ ఈ బ్లాగును మొదలుపెట్టాను.
నేను గోదావరి నీళ్లు తాగి పెరిగిన దానిని. మెట్టినిల్లు కృష్ణ జిల్లా. ఉద్యోగరీత్యా అనేక సంవత్సరాలు ప్రవాస ఆంధ్రులుగా ఉంది ప్రస్తుతం భాగ్యనగరిలో స్థిరపడ్డాము.
పుస్తకాలు చదవడం, పాత పాటలు వినడం,హాస్యం అంటే ప్రాణం పెట్టడం, తెలుగులోనే బతికి, తెలుగులోనే ఉతికి, తెలుగులోనే తెల్లవారిపోవడం నాకు చాలా ఇష్టం.
ఇప్పటికి ఇది చాలు.
Comments